
- కాంగ్రెస్ ఎమ్మెల్యేబాలు నాయక్ వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని లంబాడీలకు కేసీఆర్ ఎప్పుడూ అన్యాయం చేయలేదని, అయినా అసెంబ్లీ ఎన్నికల్లో తమ జాతి వారు కాంగ్రెస్‌కే ఓట్లు వేశారని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. గతంలో కేసీఆర్ తన కేబినెట్ లో లంబాడీలకు అవకాశం ఇచ్చారని గుర్తుచే శారు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా.. కేబినెట్ లో తమకు ప్రాతినిథ్యం లేదని, దీంతో తమ జాతి తీవ్ర అసంతృప్తితో ఉందన్నారు.
ఈ విషయం లో పార్టీ హైకమాండ్, సీఎం రేవంత్ సాను కూలంగా స్పందించాలని కోరారు. తమ
సామాజికవర్గానికి మంత్రి మండలిలో స్థానం కల్పించాల్సిందేనని, తాను ఈ పోటీలో ఉన్నానని చెప్పారు. తమ జాతిని సంతృప్తి పరిచేందుకు డిప్యూటీ స్పీకర్ పదవినో, మరేవో ఇస్తే తాము సంతృప్తి చెందలేమని, తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.