సిరిసిల్లలో మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని గెలిపిస్తాం: చక్రధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి 

రాజన్నసిరిసిల్ల, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌కు హవా ఉందని, సిరిసిల్లలో కాంగ్రెస్ ఎమ్యెల్యే అభ్యర్థి కేకే మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని గెలిపిస్తామని కనిమెని చక్రధర్ రెడ్డి అన్నారు.  మంగళవారం సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డికి టికెట్​ఇవ్వడంతో సిరిసిల్ల కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్  నెలకొందన్నారు. కేటీఆర్ అనుచరులు ఇసుక మాఫియా, ఇతర దందాలతో ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరిగిందన్నారు.

మూడు సార్లు ఓడిపోయినా నియోజకవర్గంలోనే ఉంటున్న మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాగా సోమవారం బీజేపీకి రిజైన్ ​చేసిన చక్రధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి రేవంత్‌‌‌‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. ఆయన వెంట డీసీసీ మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ, చొప్పదండి ప్రకాశ్‌‌‌‌, బాల్ రాజు, శివప్రసాద్, లక్ష్మినారాయణ,  ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, రాజిరెడ్డి, భూపాల్ రెడ్డి, బాల్ రెడ్డి, వెంకట్ పాల్గొన్నారు.