![మంత్రి పదవి ఇవ్వాలి...సీఎం నివాసం ముందు ఎమ్మెల్యే మద్దతుదారుల ఆందోళన](https://static.v6velugu.com/uploads/2023/05/Congress-MLA-D-Sudhakar-supporters-protest-outside-Cm-Siddaramaiah-residence_H4qV3ZcPE5.jpg)
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నివాసం ఎదుట హిరియూర్ ఎమ్మెల్యే డి. సుధాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. డీకే శివకుమార్, డి.సుధాకర్ పోస్టర్లతో మద్దతు దారులు నిరసన చేపట్టారు. డి. సుధాకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు.
సిద్ధరామయ్య నేతృత్వంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరింది. మొత్తం 34 మంత్రి పదవులకు గాను 10 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మరో 24 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డి. సుధాకర్‌కు మంత్రి పదవి కేటాయించాలంటూ ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు.
మే20న ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు పార్టీ నాయకత్వంలో రోజుల తరబడి చర్చలు జరిగాయి. సీఎం పదవికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు పోటీ పడ్డారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యకే మొగ్గు చూపింది.
మే 10న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 135 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 66 సీట్లతో రెండో స్థానంలో ఉండగా, జేడీ(ఎస్) 19 సీట్లలో విజయం సాధించింది.