హైడ్రా విషయంలో నో కాంప్రమైజ్: ఎమ్మెల్యే దానం నాగేందర్

హైడ్రా విషయంలో నో కాంప్రమైజ్: ఎమ్మెల్యే దానం నాగేందర్
  • ఖైరతాబాద్ లో మిషన్ పెడితే ఊరుకోను
  • మహిపాల్ రెడ్డిలా ఒకటే ఫొటో పెట్టలే
  • ఎమ్మెల్యే దానం నాగేందర్

హైదరాబాద్: హైడ్రా విషయంలో తాను కాంప్రమైజ్ కానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కుండబద్దలు కొట్టారు. ఖైరతాబాద్ లో కూల్చివేతలకు మిషన్  పెడితే ఊరుకోనని చెప్పారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. పోతే జైలుకైనా పోతా కానీ హైడ్రా విషయంలో వెనుకడుగు వేయబోనని అన్నారు. వైఎస్ ఉన్నప్పుడు కూడా అధికారుల తీరు బాగా లేకుంటే మాట్లాడేవాడినని చెప్పారు. తన ఆఫీసులో మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి ఫొటోలుంటాయని చెప్పారు. తాను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలా ఒక్క ఫొటోనే పెట్టలేదని అన్నారు.

ALSO READ | నిజామాబాద్‫ ‎లో అంతుచిక్కని వ్యాధి : లక్షల సంఖ్యలో కోళ్లు మృతి