దళితుడు నోట్లోని ఆహారాన్ని తీయించి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • బెంగళూరులో కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం

బెంగళూరు : ర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఒక దళిత స్వామీజీ విషయంలో వింతగా ప్రవర్తించారు. ద‌ళితుడు నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని తీయించి తిన్నారు.

కర్ణాటకలోని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ దళిత స్వామి నారాయణకు ఓ వేదికపై ఆహారం తినిపించారు. అంతేకాక, అతని నోటిలో పెట్టిన తర్వాత స్వామీజీ కాస్త నమిలిన ఆహారాన్ని నోటి నుంచి తీయించి ఎమ్మెల్యే తిన్నారు. పాదరాయణపూర్‌లోని అల్‌ అజర్‌ ఫౌండేషన్‌ పాఠశాలలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ జయంతి, ఈద్‌ మిలాద్‌ సందర్భంగా ఈ ఘటన జరిగింది. వేదికపైనే ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్ ఖాన్ దళిత స్వామీజీకి అన్నం తినిపించారు.

కులానికి, మతానికి మిగిలేది మానవత్వమే అని ఎమ్మెల్యే అన్నారు. ‘మనమంతా ఒకే జాతి. మనిషిగా జీవించడమే నిజమైన మతం. మానవ సంబంధాలకు కులం, మతం ఎప్పుడూ అడ్డుకావు. మనమందరం అన్నదమ్ముల్లా జీవించాలి’ అని ఎమ్మెల్యే అహ్మద్ జమీర్ ఖాన్ అన్నారు.

తమ మధ్య కుల వివక్షకు తావులేదని, పైగా తమ మధ్య సోదరభావం ఏపాటిదో చెప్పేందుకు తాను ఈ పని చేసినట్లు బల్లగుద్ది మరీ ప్రకటించుకున్నాడు ఎమ్మెల్యే. ఈ ఘటన చూసి వెనక ఉన్న అనుచరులంతా చప్పట్లతో హాలును మారుమోగించారు. 

హుబ్లీ అల్లర్లలో నిందితుల కుటుంబానికి ఆహార కిట్లు, విరాళాల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే జమీర్‌పై ఇటీవలే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తల కోసం..

సర్కారు వారి పాట సినిమాతో మహేశ్ మరో రికార్డు
255 చెట్లకు ప్రాణప్రతిష్ట