వచ్చే పదేళ్లలో తెలంగాణకు సీఎం అవుతా : జగ్గారెడ్డి

వచ్చే పదేళ్లలో తెలంగాణకు సీఎం అవుతా : జగ్గారెడ్డి

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే  జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తెలంగాణకు సీఎం అవుతానని చెప్పారు.  విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.  

విజయదశమి సందర్భంగా తన మనసులో మాట చెబుతున్నానని జగ్గారెడ్డి  అన్నారు.  సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా అని ఆయన ప్రశ్నించారు . 

ఎన్నికల కోడ్ అమల్లో  ఉండటం వలన తాను మరిన్ని విషయాలను పంచుకునేవాడినని అన్నారు.తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని చెప్పారు.  కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే అక్కడ  వాలిపోతానని జగ్గారెడ్డి తెలిపారు.  ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ తనపై ఉండాలన్నారు.  

ALSO READ :- AFG vs PAK: పాకిస్తాన్‌పై విజయం: తుపాకుల మోత మోగించిన తాలిబన్లు