ప్రతిపక్షాలపై బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.పదేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. వరంగల్ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ తో భేటీ అయ్యారు కడియం. కులమతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని.. ముస్లింలను ఉగ్రవాదులుగా ముద్రవేసి మసీదులను కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ఎన్నడూ లేని విధంగా దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు పెరిగాయని... కేంద్ర ప్రభుత్వం నివేదికలు స్పష్టం చేస్తున్నాయని కడియం తెలిపారు. సోషల్ మీడియా, మీడియాను గుప్పిట్లో పెట్టుకొని బీజేపీ విష ప్రచారాలు చేస్తోందన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి రష్యాలో పుతిన్ లాగా శాశ్వత అధ్యక్షుడిగా మోడీ ప్రకటించుకున్న మనం ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు కడియం. అంబేద్కర్ భావజాలం కలిగిన కాంగ్రెస్ కు వామపక్షాలు మద్ధతివ్వాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్య గెలుపుకు సహకరించాలని కోరారు.