
హైదరాబాద్, వెలుగు: హక్కులు కాలరాసి ప్రజలను అణిచివేసిన ఘనుడు బీఆర్ఎస్చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మండిపడ్డారు. ఓడిపోయినోళ్లు ఒక చెప్పు చూపిస్తే.. గెలిచిన తాము వెయ్యి చెప్పులను చూపించగలమని హెచ్చరించారు. బాల్క సుమన్ ఎవరో తెల్వదన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలోని మీడియా హాల్లో మాట్లాడారు.
కేసీఆర్ కుటుంబం గత పదేండ్లు తామే రాజులు.. నిజాం నవాబులమని విర్రవీగి రాష్ట్రాన్ని లూటీ చేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్ యాభై ఏండ్లు దాటినా చెక్కు చెదరలేదని, కానీ, కేసీఆర్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే కుంగిపోయిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన నాయకుడని పేర్కొన్నారు.
ALSO READ: కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్