కేసీఆర్ కుటుంబానికి బాల్క సుమన్ బానిస : మేడిపల్లి సత్యం

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.   సీఎం  రేవంత్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ  చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైరయ్యారు.  కేసీఆర్ కుటుంబానికి సుమన్ బానిస అంటూ విమర్శించారు.   

చెన్నూరులో అక్కడి ప్రజలు బాల్క సుమన్ ను చెప్పుతో కొట్టినట్లు చేశారని, బాష మార్చుకోకపోతే..  ఆయన్ను తరమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు.   ఎంపీ టికెట్ కోసం ఆశతోనే   బానిస లాంటి వ్యాఖ్యలు సుమన్  చేస్తున్నాడంటూ ఆరోపించారు.  సుమన్ ను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ చెప్పులతో కొడతారన్నారు.   ముక్కు నేలకు రాసి  సీఎం  రేవంత్ కు క్షమాపణ చెప్పకపోతే సుమన్ కు చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు.  

మరోవైపు  మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. అంతకుముందు బాల్క సుమన్ దిష్టి బొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు చెన్నూర్ కాంగ్రెస్ కార్యకర్తలు.