కబ్జా చేసిన భూములు తిరిగివ్వండి.. బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్

కబ్జా చేసిన భూములు తిరిగివ్వండి.. బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్

ఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారని  మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళి నాయక్ ఆరోపించారు.  మహబూబాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన  ప్రజాపాలన కార్యక్రమానికి హాజరైన  మురళి నాయక్.. బీఆర్ఎస్ నాయకులపై హాట్ కామెంట్స్ చేశారు.

10 ఏండ్లలో  జిల్లాలోని 3 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని.. బీఆర్ఎస్ నాయకులు వంద ఎకరాలకు తీసుకొచ్చారని విమర్శించారు.   కబ్జా చేసిన భూమిని ఇంచు  కూడా వదలిపెట్టకుండా ప్రభుత్వానికి అప్పగించాలన్నారు మురళీ నాయక్ హెచ్చరించారు. లేదంటే ఎవరి వదిలిపెట్టేదే లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల భూ కబ్జాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్న(జనవరి 2) కూడా ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూములను కబ్బా చేశాడని ఆరోపిస్తూ బాధితులు ప్రజాభవన్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల భూభాగోతాలపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు.