తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భద్రాచలం పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు. హామీ ప్రకారం ఇండ్లు కట్టించి ఇవ్వలేదని, భద్రాచలం దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో సీతారామచంద్రస్వామికి కళ్యాణానికి మొదటిసారి వచ్చినప్పుడు రూ. 100 కోట్లతో రామాలయం అభివృద్ధి చేస్తానని చెప్పారని ఎమ్మెల్యే పొదెం వీరయ్య చెప్పారు.
ALSOREAD :జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కు తెలుగు భాషా తంటాలు
2022లో వరదలు సంభవించిన సమయంలో కేసీఆర్ వచ్చారని, అప్పుడు రూ. 1000 కోట్లు కేటాయించి.. వరద బాధితులకు పక్కా ఇండ్ల నిర్మించి ఇస్తామని, కరకట్ట ఎత్తును పొడిగిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు వంద రూపాయలు కూడా హామీలో భాగంగా ఇవ్వలేదని, నియోజకవర్గం ప్రజలను మోసం చేశారంటూ భద్రాచలం పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు.