- కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా– ఈ రేస్ కేసు విచారణతో కేటీఆర్ కు మతిభ్రమించిందని, వెంటనే ఆయన ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ సూచించారు. బుధవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబం ప్రజల దృష్టి మళ్లిస్తూ రాజకీయం చేస్తోందని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం18 గంటలు కష్టపడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేక ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ కు పాలన చేతకావడం లేదనే కేటీఆర్ విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసినా వారి తీరు మారడం లేదని ఫైర్ అయ్యారు.