ప్రభుత్వ భూములు కార్పొరేట్లకిచ్చి కోట్లు దండుకుంటున్నరు

ప్రభుత్వ భూములు కార్పొరేట్లకిచ్చి కోట్లు దండుకుంటున్నరు

ఆదిలాబాద్: పేదల కడుపు నింపిన ఘనత కాంగ్రెస్‌దని, కడుపుకొట్టే సంస్కృతి టీఆర్ఎస్‌దని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బ్రిటిష్ కాలంలో జరిగిన దాడులు.. ఇప్పుడు పోడుభూముల వ్యవహారంలో జరుగుతున్నాయని సీతక్క చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెళ్లి అమరుల స్థూపం వద్ద ఆమె నివాళులు అర్పించారు. ఈ నెల 9న దళిత, గిరిజన దండోరా కార్యక్రమం ఏర్పాట్లను సీతక్క పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అడవి మీద గిరిజనులకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. కానీ కేసీఆర్ పేదలు, గిరిజనుల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. 

‘కేసీఆర్ గిరిజనుల భూములు లాక్కుంటున్నడు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి కోట్లు దండుకుంటున్నడు. పోరాటాల పురిటిగడ్డ అయిన ఇంద్రవెళ్లి నుంచే మరో పోరాటానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుంది. ఐటీడీఏలను కేసీఆర్ నిర్వీర్యం చేస్తుండు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వంపై దళిత, గిరిజన దండోరాను మొదలుపెడతాం. ప్రభ్యత్వాన్ని గద్దె దించే వరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది’ అని సీతక్క స్పష్టం చేశారు.