ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి నేతల నివాళి

ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి నేతల నివాళి

ట్యాంక్ బండ్ దగ్గర కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. కాకా స్పూర్తితో పేద ప్రజలకు మరింత సేవ చేస్తామన్నారు వివేక్ వెంకటస్వామి. చెన్నూరు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.  చెన్నూరు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసే ముందు తన నాన్నగారికి ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు.

కాకా తెలంగాణ కోసం పోరాటం చేశారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. అలాంటి మహానీయుడు కాకా వెంకటస్వామికి  మొదటి రోజు అసెంబ్లీకి వెళ్తున్న సందర్భంగా నివాళి అర్పించడం సంతోషంగా ఉందన్నారు.