కోల్‌బెల్ట్/చెన్నూరు/జైపూర్,వెలుగు: చెన్నూర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే, మాజీ ఎంపీ డాక్టర్వివేక్ వెంకటస్వామికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. చెన్నూరు పట్టణంలోని హైస్కూల్ నిర్వహించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షల కు పెంపు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలను వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జైపూర్ మండలం ఇందారం నుంచి చెన్నూరు వరకు కాంగ్రెస్ శ్రేణులు, స్థానికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. చెన్నూరు మండలంలోని కిష్టంపేటలో రేణుకా ఎల్లమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో వివేక్ పాల్గొన్నారు.
పట్టణంలోని 16వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ తుమ్మ రమేశ్ దాడిలో గాయాలపాలైన కాంగ్రెస్ కార్యకర్త బొంతల సందీప్ ఇంటికి వెళ్లిన ఆయన్ను పరామర్శించారు. అనంతరం శ్రీ సుగుణ వర్ధన్హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లీడర్లు చల్లా సత్యనారాయణ రెడ్డి, రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, విశ్వంబర్ రెడ్డి, ముదం రమేశ్, కిరణ్ గౌడ్, జైనోద్దీన్, భీమారం జడ్పీటీసీ భూక్య తిరుమల, లక్ష్మణ్, కాజీపల్లి సర్పంచ్ తిరుపతి, చేకుర్తి సత్యనారాయణ రెడ్డి, పొడేటి రవి, మోహన్ రెడ్డి, వేల్పుల శ్రీనివాస్, రాజ్ కుమార్, అమర్ సింగ్, ఆవుల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.