
- ఓబ్లాయిపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ
- ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పలేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని ఓబ్లాయిపల్లి గ్రామంలో రేషన్ షాపుల్లో తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రానున్న రోజుల్లో రేషన్ షాపుల్లో మరికొన్ని సరుకులు అందిస్తామని ఆయన తెలిపారు. అదే గ్రామంలో చేపట్టిన జై బాపు జై భీం, జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత, సుధాకర్ రెడ్డి, రామచంద్రయ్య, శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, మల్లు అనిల్ రెడ్డి, చిన్న అనిల్, కుర్మయ్య యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, ఇ వెంకటయ్య, ఆర్.వెంకట్రాములు, పాల్గొన్నారు.