- కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 90 శాతం చెరువులను బీఆర్ఎస్ నాయకులే కబ్జా చేశారని, దీనిని నిరూపించేందుకు తాను సిద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. చెరువుల కబ్జా పాపం అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్ రావుదేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా హరీశ్ రావుకు నచ్చడం లేదని, ఆయన మంత్రిగా ఉండి, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క మంచి కార్యక్రమం చేపట్టలేదన్నారు.
మామా, అల్లుళ్లకు శిక్ష పడడం ఖాయమని, దీని నుంచి వారు తప్పించుకోలేరన్నారు. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికే హరీశ్ రావు దేవుళ్ల దగ్గరకు పోతుండని విమర్శించారు. హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలను తొలగించడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చారన్నారు.