బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఓ సూసైడ్ స్టార్ : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

 బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఓ సూసైడ్ స్టార్ : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓ సూసైడ్ స్టార్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. ఓ ఆంబోతును వదిలేసినట్లు బీఆర్ఎస్ పార్టీ.. అతన్ని రాష్ట్రం మీద వదిలేసిందని ఎద్దేవా చేశారు. గాంధీ భవన్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీవీ చానళ్లలో కనిపించడానికి కౌశిక్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు. ఉద్యోగాలిప్పిస్తానని హుజురాబాద్ లో ఎంతో మంది నుంచి లక్షల రూపాయలు గుంజినవ్. ఇప్పుడేమో.. ఏం తప్పు చేయనట్లు.. నీతిమంతుడి లెక్క మాట్లాడుతున్నవ్.

 నువ్వు చేసిన తప్పులకు ఆధారాలతో సహా కేసులు పెట్టిస్తం’’అని వెంకట్ మండిపడ్డారు. కాంగ్రెస్​లో ఉంటూ.. బీఆర్ఎస్​కు కోవర్టు లెక్క పని చేశాడని ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ సస్పెండ్ చేసే టైమ్​లో.. కేటీఆర్ కాళ్లు మొక్కినవ్.. మీరే దిక్కు అంటూ బీఆర్ఎస్​లో చేరినవ్.. ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నవ్.. ఆదిలాబాద్ సభలో కాంగ్రెస్ నేతలను కేటీఆర్ లుచ్చాగాళ్లు అన్నడు. ఇంకోసారి మా పార్టీ లీడర్ల గురించి మాట్లాడితే గుడ్డలూడదీసి కొడ్తం. మంత్రిగా పని చేసినవ్.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​గా ఉన్నవ్.. ఎట్ల మాట్లాడాలో తెల్వదా?’’అని వెంకట్ మండిపడ్డారు.