కేటీఆర్ ఓ డ్రామా ఆర్టిస్టు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ ఓ డ్రామా ఆర్టిస్టు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి  వెంకట్​ ఫైర్​ అయ్యారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్​కు ఊరట లభించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ కోసం తపన పడుతున్నట్టు చెప్తున్న కేటీఆర్​కు.. అసలు సిటీ అభివృద్ధి విషయంలో ఏమాత్రం స్పష్టత లేదని ఆరోపించారు.

 హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అడ్డమైన జీవోలు ఇచ్చి ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. , ఈడీ కేసులను లొట్టపీసు కేసులు అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.