హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో అరెస్ట్ భయంతో కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని అన్నారు. వెంటనే ఆయన పాస్ పోర్టు సీజ్ చేయాలని అన్నారు. ఈ కేసులో ఏసీబీ విచారణపై కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు మంగళవారం (జనవరి 7) కొట్టివేసింది.
కేటీఆర్ తప్పు చేయకపోతే ఆయనకు లీగల్ టీమ ఎందుకని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. దొంగలకు అండగా ఉంటారా.. ప్రజలకు అండగా ఉంటారా.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు తేల్చుకోవాలన్నారు.
Also Read : కేటీఆర్ అరెస్ట్ పైనా.. స్టే ఎత్తివేసిన హైకోర్టు
HMDAకు చెందిన 55 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కేటీఆర్ దోచుకున్నారు.. బాధ్యత శాసన సభ్యునిగా తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలన్నారు. మీ అవినీతిలో 55కోట్లు చిన్నవి కావొచ్చ.. ప్రజల సొమ్ము దోచుకుంటే వదిలే ప్రసక్తే లేదని అన్నారు. తప్పు చేస్తే ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదని అన్నారు.
ఏ తప్పు చేయకపోతే కేటీఆర్ విచారణ కు ఎందుకు హాజరు కాలేదని అన్నారు. డ్రామారావు రాజకీ లబ్ది కోసమే విచారణకు పోలేదన్నారు. దోచుకున్న ప్రజల సొమ్మును ప్రజలకు పంచిపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.