చొప్పదండి, వెలుగు: తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రతి పట్టభద్రునికి చేదోడు వాదోడుగా ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం చొప్పదండి మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి, ఏఐసీసీ పెద్దలకు, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సత్యప్రసన్నారెడ్డి, లీడర్లు చిలుక రవీందర్, గుర్రం భూమారెడ్డి, హన్మంతరెడ్డి, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కరీంనగర్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ చౌక్ లో ఆ పార్టీ లీడర్లు స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఆకారపు భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.