
కరీంనగర్ టౌన్/ తిమ్మాపూర్, వెలుగు: ఓటమి భయంతో కుల రాజకీయాలను సోషల్ మీడియాలో తెరమీదకు తెచ్చిన వారిని నమ్మొద్దని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ చైర్మన్ వూట్కూరి నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం సిటీలోని అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ తో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అలుగునూర్ గ్రామంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో నరేందర్ రెడ్డి మాట్లాడారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు. సమావేశంలో పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధగోని లక్ష్మీనారాయణగౌడ్, ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.