నిజమాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. భీంగల్ మండలం బాబాపూర్లో నిన్న మృతి చెందిన సరస్వతి టీచర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా.. పోలీసులు ముందస్తుగా జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కమ్మర్ పల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.
కాగా.. టీచర్ సరస్వతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై స్పందించే ప్రతిపక్ష నేతలు కేసీఆర్కు దొంగల్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడం నేరమా అని మండిపడ్డారు. కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతుందన్నారు. ప్రభుత్వ తప్పులను ప్రతిపక్ష నేతలు ప్రశ్నించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కని ఆయన అన్నారు.
317 జీవో కారణంగా మనస్థాపానికిలోనై ఆత్మహత్య చేసుకున్న బీంగల్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి కారును పోలీసులు ఛేజ్ చేసి కమ్మర్ పల్లి వద్ద అడ్డుకుని, అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
— Revanth Reddy (@revanth_anumula) January 10, 2022
For More News..