కాళేశ్వరం ప్రాజెక్ట్ను సీఎం కేసీఆర్ అవినీతి ప్రాజెక్ట్గా మార్చారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కేసీఆర్ ఏ నాటికైనా న్యాయవిచారణ ఎదుర్కోవాల్సిందేనన్నారు. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర బీజేపీ నాయకులు కేవలం మాటలకే పరిమితం అవుతున్నారన్న జీవన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అంతర్గత ఒప్పందంలో భాగమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అని జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామన్నారు. కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతామని.. కేసీఆర్ కటాకటాల వెనక్కి పోవడం తథ్యమని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు ఓటు అనే విష్ణుచక్రంతో కేసీఆర్ ని ఓడిస్తారని తెలిపారు.