-
ఢిల్లీలో రైతులు చస్తుంటే బీజేపీ యాత్రలా?
-
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు ఎట్లా మూడిందో.. మోదీకి అదే గతి పడుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమాలకు సంఘీభావంగా ఎల్బీ స్టేడియం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ‘ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తుంటే సంకల్ప యాత్రలతో బీజేపీ తిరుగుతోంది. కిషన్ రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నరు.
అసలు వ్యవసాయం అంటే ఆయనకి తెలుసా..? రైతులను లేకుండా చేసి బీజేపీ ఏం సాధించాలనుకుంటోంది? రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తే దేశం అభివృద్ధి చెందినట్టా.? స్వామినాథన్ కు భారత రత్న ఇచ్చారు. కానీ ఆయన సిఫార్సులు అమలు చేయాలని రైతులు అడుగుతుంటే కాల్చి చంపుతున్నరు. దేశ రైతాంగ సంక్షేమానికి ఇందిరా గాంధీ బాటలు వేసింది. కాంగ్రెస్ హాయాంలోనే ఎఫ్ సీఐలు ఏర్పాటైనయ్. అంబానీ, అదానీ ఇంట్లోనే వికసిత్భారత్ వెలుగుతోంది’ అని జీవన్ రెడ్డి ఎద్దేశా చేశారు.