చివరి ఏడాదిలో స్కీముల పేరుతో మోసం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

  •   ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 

ధర్మపురి, వెలుగు : సీఎం కేసీఆర్​ పాలనలో మొదటి నాలుగేళ్లు తన కుటుంబం కోసం పనిచేశారని, చివరి ఏడాదిలో సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ధర్మపురిలో జరిగిన కార్యక్రమంలో మండలానికి చెందిన 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ పథకం కేవలం వడ్డీ మాఫీగా మారిందని ఆరోపించారు. 

రాష్ట్రంలోని నిరుద్యోగ యువత జీవితాలతో కేసీఆర్​ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో  కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్, లీడర్లు పాల్గొన్నారు.