హైదరాబాద్, వెలుగు: పదేళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి లొట్టపీసు కేసు, లొట్టపీసు సీఎం అని మాట్లాడడం ఏమిటని కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. చదువుకున్న వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి అని ప్రశ్నించారు.
కేసీఆర్ నేర్పిన సంస్కారం, సంస్కృతి ఇదేనా అని ఫైర్ అయ్యారు. సీఎం హోదాను, ఆ పదవిని గౌరవించే సంస్కారం కేటీఆర్ కు లేకపోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఫార్ములా ఈ రేస్ లో నిధుల దుర్వినియోగం కొట్టొచ్చినట్లు కనపడుతోందన్నారు.