బీఆర్ఎస్ తుడిచి పెట్టుకుపోవడం కవిత పుణ్యమే:జీవన్ రెడ్డి

  • రాష్ట్రంలో రెండో అధ్యాయం మొదలు

జగిత్యాల: బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్​ ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్​ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో  కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఎమ్మెల్సీ కవిత ఎవరు.. కవిత ఏందీ అని ఆయన ప్రశ్నించారు.  సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్​ను చిత్తుగా ఓడించి కవితకు బొగ్గుగని కార్మికులు బుద్ది  చెప్పారని అన్నారు. 

ఐదేళ్లు ఎంపీగా ఉండి దొరసాని ఏం చేసిందని ప్రశ్నించారు.  నిర్వహణలో ఉన్న చెక్కర  ఫ్యాక్టరీని మూసివేయించిందన్నారు. కవిత ఏ మాతని గౌరవిస్తుంది,  బతుకమ్మ ఆడగానే హిందూ మతం మీద గౌరవం వచ్చిందా  అని ఆయన నిలదీశారు.  ఎన్నికలు వస్తేనే కవితకు  ముస్లింలు కావాలని, కానీ వారి హక్కుల  కోసం మాట్లాడదన్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్  ప్రభుత్వం తుడిచి పెట్టుకు పోవడానికి కారణం దొరసాని  కవిత పుణ్యమేనని ఆయన హాట్​కామెంట్స్​ చేశారు.  కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రెండో అధ్యాయం మొదలైందని ఆయన అన్నారు.
=============================