కేసీఆర్ చేసేది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ

కేసీఆర్ చేసేది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా గంగాధర మండంలంలో నిర్వహించిన కాంగ్రెస్ రైతు రచ్చబండలో ఆయన పాల్గొన్నారు. 5 బడ్జెట్లు పూర్తైన రుణమాఫీకి దిక్కులేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. భూమి లేని పేదలకు భూమి ఇస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ రుణమాఫీ చెయ్యక..బ్యాంకులు కొత్త అప్పు ఇయ్యక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాగా కరీంనగర్ డెయిరీ పాడి రైతులకు రావాల్సిన లీటర్ కు 4 రూపాయల ప్రభుత్వ రాయితీ ఇవ్వడం లేదని కరీంనగర్ కలెక్టరేట్ నిర్వహించిన  ప్రజావాణిలో జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాయితీ వెంటనే ఇవ్వకపోతే పాడి రైతులతో కలిసి జూన్ 2 నుంచి దీక్షలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం

జడ్జిలను విమర్శించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ప్రజలకు పనికిరాని నాయకులను స్క్రాబ్ లో వేయాలి