హైదరాబాద్, వెలుగు: అక్రమ నిర్మాణాలను ఏ ప్రభుత్వమైనా.. తొలగించాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలోనూ కూల్చివేతలు జరిగాయని గుర్తు చేశారు.
యూపీలో మాత్రం బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలకు సంబంధం లేకుండా కూల్చేస్తున్నారు. హైడ్రాతో కొంత మందికి బాధ కలుగవచ్చని, కానీ బాధితులకు కాంగ్రెస్ మంచి భవిష్యత్తు ఇస్తుందన్నారు. ప్రచారం కోసమే బీజేపీ దీక్ష చేస్తోందని మండిపడ్డారు.