వాళ్లు కాళేశ్వరం విహారయాత్రకు వెళ్లారు:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

వాళ్లు కాళేశ్వరం విహారయాత్రకు వెళ్లారు:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ లీడర్లంతా కాళేశ్వరం విహార యాత్రకు వెళ్లారని విమర్శించారు కాంగ్రెస్  ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి. కుంగిన పిల్లర్లు చూసి కేటీఆర్ మాట్లాడాలన్నారు. కాళేశ్వరం అప్పులకు కేసీఆరే బాధ్యుడన్నారు.  30 వేల కోట్ల ఖర్చు అయ్యే ప్రాజెక్టుకు లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేశారని ఫైరయ్యారు. వాస్తవాలను కప్పి పుచ్చుకోవడానికే విహారయాత్రల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. చేసిన తప్పులకు శిక్ష తప్పదన్నారు జీవన్ రెడ్డి. ఇప్పటికైనా కేసీఆర్ వాస్తవాలు గ్రహించి..తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. 

 ఇవాళ  కాళేశ్వరం పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భాగంగా కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ఆగస్టు 2 లోపు కాళేశ్వరం పంపు హౌసులు  ఆన్ చేసి ప్రాజెక్టులకు నీళ్లివ్వాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో 50 వేల మందితో తామే పంపు హౌసులు ఆన్ చేస్తామని హెచ్చరించారు.