పేపర్ లీకేజీతో తెలంగాణ పరువు తీశారు: జీవన్ రెడ్డి

పేపర్ లీకేజీతో  తెలంగాణ  పరువు తీశారు: జీవన్ రెడ్డి

పేపర్ లీకేజీతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ  పరువు తీసిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం  టెట్ ఎక్జామ్ పెట్టడమే మర్చిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు.  ఖాళీలకు అనుగుణంగా  ప్రభుత్వం ప్రతి సంవత్సరం డీఎస్సీ  నిర్వహిస్తుందన్నారు. ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని చెప్పారు.

Also Read:రైతు భరోసాపై అసెంబ్లీలో రోజంతా చర్చ పెడుతాం 

తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందన్నారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ కు ప్రజలు రెండుసార్లు  అధికారం కట్టబెట్టినా లక్ష్యం నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ డీఎస్సీ ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెడుతుంటే బీఆర్ఎస్ ఆటంకం సృష్టిస్తుందని మండిపడ్డారు జీవన్ రెడ్డి.  బీఆర్ఎస్  చేయలేనిది కాంగ్రెస్  ప్రభుత్వం చేస్తుందంటే హర్షించాలన్నారు.  హరీష్ రావు,  కేటీఆర్ నిరుద్యోగ యువతకు ఆత్మస్థైర్యం కల్పించాలన్నారు.  కానీ వీళ్లు యువతలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు.