కేంద్రమంత్రివి... ఇన్వెస్ట్‌గేట్ ఏజెన్సీని అవమానిస్తవా?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

  • కేంద్రమంత్రి హోదాలో ఉండి అట్ల మాట్లడ్తవా
  •  రేవంత్ రెడ్డిని అవమానించడం కరెక్ట్ కాదు
  • సీఎంను ఎలా గౌరవించాలో కేటీఆర్ నేర్చుకోవాలి
  • ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

హైదరాబాద్: బండి సంజయ్ కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇన్వెస్ట్‌గేట్ ఏజెన్సీని అవమానిస్తున్నాడని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఫైర్​అయ్యారు. ముఖ్యమంత్రి హోదాను ఏ విధంగా గౌరవించాలో కేటీఆర్ నేర్చుకోవాలని సూచించారు. 

సంక్రాంతి కానుకగా భూభారతిని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. అసెంబ్లీ పాయింట్ వద్ద జీవన్​రెడ్డి మాట్లాడుతూ ‘ధరణిపేరుతో ప్రభుత్వ భూములను మింగేశారు. కబ్జాకు గురైన జాగలను వెనక్కి తీసుకుంటం. కొత్త పాస్​పుస్తకాలు జారీ చేస్తం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ వస్తుంది. ఎవరో ఒకరు తప్పు చేస్తే.. వ్యవస్థలకు మొత్తం ఆపాదించలేం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించడం కరెక్ట్ కాదు’ అని పేర్కొన్నారు.

ALSO READ | గుడ్ న్యూస్: తెలంగాణలో కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు..జీవో జారీ