కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ ను రద్దు చేస్తూ పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ పార్లమెంటరీ కమిటీ ముందు ఎంపీ అధిర్ రంజన్ చౌదరి హాజరయ్యారు. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. దీంతో బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటరీ కమిటీ సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ నిర్ణయాన్ని స్పీకర్ కు పంపారు.
ALSO READ :జగిత్యాల యువతి డెత్ మిస్టరీ.. అక్క పడుకున్నప్పుడు నేను వెళ్లిపోయా
ఇటీవల జరిగిన పార్లమెంటరీ సమావేశాల్లో మణిపూర్ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.ఈ సందర్భంగా మోదీపై అధిర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని దృతరాష్టునితో పోల్చారు. దీంతో ఆగస్టు 11న ఆయనపై సస్పెన్షన్ వేశారు.