హత్రాస్ బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ

హత్రాస్ బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ

ఉత్తరప్రదేశ్: హత్రాస్ తొక్కిసలాట బాధితులను కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ లోక్‌సభ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. 2024, జూలై 2న హత్రాస్‌లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనాలు పాల్గొన్నారు. 

ఈ ఘటనలో 121 మంది ప్రాణాలను కోల్పోయారు. తీవ్రంగా గాయపడని మందల మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  జూలై 5వ తేదీన హత్రాస్ తొక్కిసలాట ప్రమాదంలో మృతుల కుటుంబాలను రాహుల్ గాంధీ కలిసి పరామర్శించారు. యూపీలోని అలీఘర్ జిల్లా ఫిలక్నా గ్రామంలోని బాధిత ఫ్యామిలీ ఇంటికి వెళ్లి..వారితో మాట్లాడారు.ప్రమాదం ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు  అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  కాంగ్రెస్ పార్టీ తరపున ఆదుకుంటామని చెప్పారు.  

ALSO Read : అక్రమంగా ఇల్లు కూల్చారని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా

రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. "చాలా కుటుంబాలు ప్రభావితమయ్యాయి. చాలా మంది మరణించారు. నేను దీనిని రాజకీయం చేయదలచుకోలేదు. వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. చాలా నిరుపేద కుటుంబాలైనందున వారికి మరింత పరిహారం ఇవ్వాలని కోరుతున్నా" అని అన్నారు.