
తెలంగాణ ప్రజలు బేమాన్లు కాదని, ఇమాన్ దారులని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు . 17ఎంపీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా .. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుందామని పిలుపునిచ్చారు . బుధవారం గద్దర్ తో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు . ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడారు. తాను సెక్యూలరిజానికి మద్దతుగా ఉంటానన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, అంజన్ కుమార్ కు మద్దతు ప్రకటించారు. తెలంగాణఉద్యమంలో కాంగ్రెస్ ఎంపీలు తమ వంతు పోరాటం చేశారని పేర్కొన్నారు. రాచరికపు పాలన అంతం కావాలని అభిలాషించారు. అంజన్ కుమార్ మాట్లాడుతూ, ఈ సారి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టాలని కోరారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుడి పోరాడుతానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు .