- కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి
నారాయణపేట, ధన్వాడ : పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే పాలమూరు ప్రగతి గంగలో కలిసిపోతుందని కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ ఇన్ చార్జి కుంభం శివకుమార్ రెడ్డి నేతృత్వంలో నారాయణపేటలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డితో కలిసి శనివారం ఆయన భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. అలాగే ధన్వాడ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు.
బీజేపీ కుల, మత విద్వేషాలు రెచ్చగొడితే.. డీకే అరుణ విధానం అవినీతి, అక్రమాలు దందాలని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో పాలమూరు పచ్చగుండాలని తాను తపిస్తుంటే.. డీకే అరుణ శనిలా దాపురించి అశాంతిని నెలకొల్పేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
పాలమూరు : బీజేపీ, బీఆర్ఎస్ ప్రలోభాలకు తెరలేపాయని వంశీ చంద్ రెడ్డి ఆరోపించారు.శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గద్వాల రౌడీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.