పసుపు బోర్డు ఎక్కడుంది..?

పసుపు బోర్డు ఎక్కడుంది..?
  •     కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శ 
  •     ఎంపీ అర్వింద్‌‌ సమాధానం చెప్పాలి 

నిజామాబాద్​, వెలుగు :  పసుపు బోర్డు పేరుతో బీజేపీ మరోసారి రైతులను మోసం చేయడానికి రెడీ అయిందని నిజామాబాద్​ కాంగ్రెస్​ పార్లమెంట్​ అభ్యర్థి జీవన్​రెడ్డి ఫైర్​అయ్యారు. శనివారం మొదటిసారి నిజామాబాద్​ వచ్చిన జీవన్​రెడ్డి కాంగ్రెస్​ పార్లమెంట్​ సెగ్మెంట్​ మీటింగ్​లో ప్రసంగించారు.  2019 ఎలక్షన్​లో అర్వింద్​ బాండ్​ పేపర్​ నమ్మి రైతులు ఓట్లేయగా ప్రధాని మోదీ ప్రకటన సాక్షిగా మరోమోసానికి తెరలేపారన్నారు. ఆరు నెలల కింద ప్రధాని స్థాయిలో మోదీ ఇందూరు గడ్డపై చేసిన బోర్డు ఏర్పాటు ప్రకటన కార్యరూపం దాల్చలేదన్నారు.

2002లో తెలుగుదేశం గవర్నమెంట్​ నిజాం చక్కెర ఫ్యాక్టరీలను  ప్రైవేటు పరం చేసి మిత్రపక్షమైన బీజేపీ ఎంపీ గోకరాజు గంగారాజుకు సేల్​ చేసిందని విమర్శించారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఫ్యాక్టరీలు మొత్తానికి క్లోజ్​అయ్యాయన్నారు.  ఖాయిలా పరిశ్రమలు ఓపెన్​ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని ప్రధాని మోదీ సర్కారులో సభ్యుడైన ఎంపీ అర్వింద్​ ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్​ చెప్పిన ప్రకారం 2025 నాటికి ఫ్యాక్టరీలు తెరుస్తామని, నిజామాబాద్​ సహకార చక్కెర పరిశ్రమ (ఎన్సీఎస్సెఫ్​) బాధ్యత తమదేనన్నారు.  

ఎమ్మెల్సీ మహేశ్ ​గౌడ్​, ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, డాక్టర్​ భూపతిరెడ్డి, కార్పొరేషన్​ల చైర్మన్​లు తాహెర్​, మోహన్​రెడ్డి, అన్వేష్​రెడ్డి, ఈరవత్రి అనిల్​, ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు ప్రసంగించారు.  సుమారు 4 గంటల పాటు మీటింగ్​ కొనసాగింది.