నారీ న్యాయ్ తో పేద మహిళలకు రూ. లక్ష సాయం : జీవన్ రెడ్డి

నారీ న్యాయ్ తో పేద మహిళలకు రూ. లక్ష సాయం : జీవన్ రెడ్డి

బాల్కొండ, వెలుగు:  ప్రతి పేద మహిళకు ఏటా రూ. లక్ష సాయం అందేలా నారీ న్యాయ్ పేరుతో కాంగ్రెస్‌ గ్యారంటీ అందిస్తుందని, 30 లక్షల ఉద్యోగాల భర్తీతో యువత కు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్  ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు.  బుధవారం కమ్మర్‌‌పల్లి మండలం బషీరాబాద్, కోనసముందర్‌‌ గ్రామాల్లో ముత్యాల సునీల్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాంగ్రెస్‌  పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామన్నారు. గల్ఫ్ కార్మికులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన 4  నెలల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు.  పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.  కార్యక్రమంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్క రాజేశ్వర్, సుంకెట్ రవి  పాల్గొన్నారు.