
పాలమూరు, వెలుగు: పండుగలు సోదరభావాన్ని పెంపొందిస్తాయని కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ వంశీచంద్ రెడ్డి తెలిపారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నేత ఎన్పీ వెంకటేశ్ ఇంట్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ క్యాండిడేట్ మన్నె జీవన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.