సుత్తి కవిత్వం కాదు..టీఆర్ఎస్​గా పేరు మార్చు : చామల సవాల్

  • కేటీఆర్​కు ఎంపీ చామల సవాల్

న్యూఢిల్లీ, వెలుగు: తమ అజెండా తెలంగాణనే అయితే బీఆర్ఎస్ ను... తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలని కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు మంగళ వారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ‘కేటీఆర్ నీ ట్విట్టర్ ఖాతాలో రాసిన.. సుత్తి “కపి త్వం”గరించి చదివే, వినే ఓపిక, తీరిక తెలంగాణ సమాజానికి లేదు. 

కానీ నీ జెండా, నీ ఎజెండా, నిజం గానే తెలంగాణనే ఐతే.. నీకు నా సవాల్! నీ పార్టీ పేరును మళ్లీ.. “తెలంగాణ”రాష్ట్ర సమితిగా మార్చు’’ అని తన పోస్టులో పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంపై బీజేపీకి నమ్మకం లేదు.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై బీజేపీ నేతలకు నమ్మకం, గౌరవం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.