కంచ గచ్చిబౌలిభూములను కాజేసేందుకు కేటీఆర్ కుట్ర : చామల కిరణ్ కుమార్

కంచ గచ్చిబౌలిభూములను కాజేసేందుకు కేటీఆర్  కుట్ర : చామల కిరణ్ కుమార్
  • చామల కిరణ్ కుమార్ ఆరోపణ

న్యూఢిల్లీ, వెలుగు: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని బీఆర్ఎస్  ఎమ్మెల్యే కేటీఆర్  కాజేసేందుకు కుట్రపన్నారని కాంగ్రెస్  ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దాదాపు 177 ఎకరాల భూములను వారి అనుచరులకు కట్టబెట్టుకున్న చరిత్ర కేటీఆర్ దని ఆయన మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్  హయాంలో 13 జిల్లాల్లోని 4.28 లక్షల ఎకరాల అటవీ భూమి మాయమైందన్నారు. 

శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపీలు మల్లు రవి, సురేశ్  షెట్కార్, రఘురాం రెడ్డితో కలిసి చామల మీడియాతో మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు  ఆదేశాలు పాటిస్తామని, భూములకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. ఆ భూముల విషయంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ విషప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.