
- పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని కేటీఆర్ లూటీ చేశారు: చామల
న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదని.. ఆయనో పీత అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ను జాతి పిత అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. హరీశ్ అంత పొడుగు పెరిగాడు కానీ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ‘మీ మామ ఒక పీత. ఆయనకు వాసన లేనిదే నిద్రపట్టదు’అని ఫైర్ అయ్యారు. సోమవారం ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో మీడియాతో చామల మాట్లాడారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణను కేసీఆర్ లూటీ చేశారని ఆరోపించారు.
గత ప్రభుత్వం వదిలేసిన బకాయిలను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కోటిగా చెల్లిస్తున్నదని చెప్పారు. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించేలా ‘తెలంగాణ రైజింగ్’ నినాదంwతో ముందుకెళ్తున్నామన్నారు. తాము ప్రజల కోసం ఇంత చేస్తుంటే బీఆర్‌ఎస్, బీజేపీ కాంగ్రెస్‌ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఫైర్ అయ్యారు. తమను విమర్శించే ముందు.. 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం తెచ్చారో సమాధానం చెప్పాలన్నారు.