రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే : ఎంపీ చామల

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే : ఎంపీ చామల
  • ఎంపీ చామల వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన మాట ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్షాలు అసలు విషయంపై మాట్లాడకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. హైకమాండ్ అనుమతితోనే సీఎం రేవంత్, పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్ చెన్నై వెళ్లారని చెప్పారు. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత మెట్రో విస్తరణ ఒక మీటర్ కూడా ముందుకు సాగలేదని  తెలిపారు. హరీశ్ రావు, పద్మారావులు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ ను  కలిశారని, అందులో తప్పేముందని స్పష్టం చేశారు. తాము రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీలో ప్రధాని మోదీని కలవడం లేదా అని చామల పేర్కొన్నారు.