ఈ ఏడాది 6 లక్షల ఇండ్లు కేటాయించాలి

ఈ ఏడాది 6 లక్షల ఇండ్లు కేటాయించాలి
  • కేంద్రానికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎంపీ చామల డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు ఈ ఏడాది 6 లక్షల ఇండ్లను కేటాయించాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎంపీ చామల కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. రాష్ట్రంలో ఇండ్లు లేని అర్హులైన పేదలకు దాదాపు 33.88 లక్షల ఇండ్లు అవసరమని, అందులో కనీసం ఈ ఏడాది 6 లక్షల ఇండ్లను కేటాయించాలని కోరారు. సోమవారం, పార్లమెంటు హాల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన హౌసింగ్‌‌‌‌‌‌‌‌, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌‌‌‌‌‌‌‌ కమిటీ మొదటి సమావేశానికి ఎంపీ చామల హాజరయ్యారు. ప్రధాన మంత్రి ఆవాస్‌‌‌‌‌‌‌‌ యోజన(పీఎంఏవై) కింద గత పదేండ్లలో రాష్ట్రానికి 1.58 లక్షల ఇళ్లను మాత్రమే కేంద్రం మంజూరు చేసిందని గుర్తుచేశారు.

 గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేదని, దాంతో రాష్ట్ర వాటాను సాధించలేకపోయిందని చామల గుర్తుచేశారు. ఈ భేటీలో పీఎంఏవై, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మెట్రో రైల్‌‌‌‌‌‌‌‌ విస్తరణ, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ సమస్య, వరంగల్‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ సమస్యలను ఎంపీ ప్రస్తావించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో అనధికారిక లేఔట్ల కారణంగా ప్రజలు రోడ్లు, తాగునీరు సరాఫరా, మురుగునీటి వ్యవస్థ వంటి సదుపాయాలు కోల్పోతున్నారని ఎంపీ చామల అన్నారు.