హైదరాబాద్, వెలుగు: అల్లు అర్జున్ వివాదాన్ని ముగించాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడితో తమ పార్టీకి సంబంధం లేదన్నారు.
ఇండస్ట్రీకి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, రేవంత్ సర్కార్కు ఎలాంటి కక్ష సాధింపులేదని వివరించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ కాకుండా అల్లు అర్జున్ సొంతంగా మాట్లాడితే బాగుండేదని చామల పేర్కొన్నారు.