కేసీఆర్‌‌ ప్రజల్లోకి వస్తే స్వాగతిస్తం

కేసీఆర్‌‌ ప్రజల్లోకి వస్తే స్వాగతిస్తం
  • ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడిగా హాజరై ప్రజల తరఫున పోరాడాలని అప్పుడే ఆయనను ఆహ్వానించామని గుర్తుచేశారు. అయితే ఓటమి బాధ ఒక వైపు, బిడ్డ జైల్లో ఉండడం ఇంకో వైపు..

ఈ రెండింటితో ఆయన బయటి ప్రపంచానికి ముఖం చూపించలేదన్నారు. ఇప్పుడైనా జనంలోకి వచ్చి తమ ప్రభుత్వం చేస్తున్న మంచికి సహకరిస్తూ, ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించాలని కోరారు. ఆయన జనంలోకి వచ్చే ముందు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ఎస్ ఏయే అంశాలను పెట్టింది, అందులో ఎన్ని నెరవేర్చారో, తాము ఏం చేశామో యాదాద్రి వేదికగా చర్చ పెడదామన్నారు.