రజతోత్సవాలు టీఆర్ఎస్​కా.. బీఆర్ఎస్​కా? : ఎంపీ చామల

రజతోత్సవాలు టీఆర్ఎస్​కా.. బీఆర్ఎస్​కా? : ఎంపీ చామల
  • కాంగ్రెస్ ఎంపీ చామల ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: రజతోత్సవాలు టీఆర్ఎస్ కా.. బీఆర్ఎస్ కా.. అని ఆ పార్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ టీఆర్ఎస్ రజతోత్సవాలు అయితే రెండు, మూడేండ్ల కిందే ఆ పార్టీ పేరు మార్చి దాన్ని బొందపెట్టారన్నారు. బీఆర్ఎస్ అయితే అది పుట్టి రెండు, మూడేండ్లే అవుతుందని, మరి 25 ఏండ్ల ఆవిర్భావ పండుగ దేనికో చెప్పాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణకు కేసీఆర్ సీఎం కావడం చారిత్రాత్మక అవసరమని కేటీఆర్ అంటున్నారని, ఆ అవసరం ఎందుకో చెప్పాలన్నారు. రూ.లక్ష కోట్లతో కూలిపోయే కాళేశ్వరం కట్టినందుకా, మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినందుకా.. దోచుకోవడంలో మీ టార్గెట్ ఇంకా పూర్తికానందుకా.. అంటూ కేటీఆర్‌‌‌‌ను నిలదీశారు. దోచుకోవడానికే మళ్లీ అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నారా అని ప్రశ్నించారు.