తెలంగాణలో వానలు వచ్చినా..వరదలు వచ్చినా కేటీఆర్ కు పట్టదన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ ట్విట్లు చేసుడు తప్ప ఏమీ చేతాకాదన్నారు. ఎక్స్ లో మెసేజ్ లు పెట్టి నవ్వుల పాలు అవుతున్నారని ధ్వజమెత్తారు చామల. ఉత్తర ప్రదేశ్ బుల్డోజర్ పాలన మీద సుప్రీం కోర్ట్ తీర్పు ఇస్తే.. తెలంగాణ హైడ్రాపై కోర్టు తీర్పు ఇచ్చినట్లు కేటీఆర్ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రాపై ప్రజలను తికమక పెట్టడానికి కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాను బుల్డోజర్ తో పోల్చి ప్రజలను తికమక పెట్టొద్దని సూచించారు.
ALSO READ | జూబ్లీహిల్స్ కొండరాళ్ల బ్లాస్టింగ్పై హైకోర్టులో విచారణ
ఎంత ఒత్తిడి వచ్చినా రేవంత్ రెడ్డి హైడ్రాను ముందుకెళ్తారని చెప్పారు ఎంపీ చామల. హైదరాబాద్ లో లేక్స్ ను కాపాడుతామని రేవంత్ రెడ్డి మేనిఫెస్టో లో పెట్టారని తెలిపారు. తమకు ప్రజా పాలన అందించాలన్న పట్టుదల ఉందన్నారు చామల. బీఆర్ఎస్ లో రెండు గ్రూప్ లు ఉన్నాయని.. ఖమ్మంలో రెండు బీఆర్ఎస్ గ్రూప్ లు కొట్టుకుంటే, కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసు పెట్టారని చెప్పారు చామల.
కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద వెంటనే తెలంగాణకు ప్యాకేజి విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తెలంగాణలో పర్యటించి జరిగిన నష్టాన్ని తెలుసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.