ప్రధానిగా మోదీ ఎన్నాళ్లుంటారో..సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం డౌటే: గౌరవ్ గొగోయ్

ప్రధానిగా మోదీ ఎన్నాళ్లుంటారో..సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం డౌటే: గౌరవ్ గొగోయ్
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం డౌటే: గౌరవ్ గొగోయ్

గువాహటి: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకూ ఎలాంటి అనుమానం లేదు.. కానీ ఆ ప్రభుత్వాన్ని మోదీ ఎన్నాళ్లు నడుపుతారో మాత్రం ఊ హించలేమని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చెప్పారు. ప్రధానిగా మోదీ ఎన్నాళ్లు ఉంటారో కూడా తెలియదని అన్నారు. ఆయన ఎక్కువ కాలం ప్రధానిగా ఉండక పోవచ్చని, ఐదేళ్లూ ఈ ప్రభుత్వం ఉండదని పేర్కొన్నారు.

సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడానికి విశాల హృదయం, ఓపెన్ మైండ్, అందరినీ కలుపుకొని పోయే లక్షణాలు ఉండాలని అన్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దివంగత అటల్ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌పేయికి ఆ లక్షణాలు ఉన్నాయి కానీ మోదీకి లేవని ఆయన విమర్శించారు. దీంతో ఆయన ప్రధానమంత్రిగా ఐదేండ్లు పనిచేయడం ప్రశ్నార్థకమేనని గొగోయ్ చెప్పారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం సన్మానించారు.

ఈ సందర్భంగా గౌరవ్​గొగోయ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ కంటే ఎక్కువ సీట్లు ఇచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.